{"product_id":"thasmath-jaagrattha-telugu","title":"Thasmath Jaagrattha (Telugu)","description":"\u003cstrong\u003e'తస్మాత్ జాగ్రత్త' 'స్వతంత్రమా జాగ్రత్త' ' నెట్టింటి భాగోతం'\u003c\/strong\u003e నాటికల గురించి వివరించాలంటే ..'తస్మాత్ జాగ్రత్త' నాటికలో ప్రతీ పాత్ర ఒక తరానికి సంబంధించింది. అన్నీ కలిసి ఒక సంప్రదాయం గురించి చెబుతాయి. ముఖ్యంగా పర్యావరణం ఆధారంగా రచించడం జరిగింది. చారుమతి పాత్ర తన పాతకాలం పద్ధతులని పాటించమంటే, కొడుకు సోమయాజులు కాలాన్ని బట్టి మారాలి అంటాడు. కాశీపతి అవకాశాన్ని ఎలా వాడుకోవాలో చెబుతాడు. కాకి కామేశం ఎలా వాడుకోవాలో చూపిస్తాడు. ఇక అద్దేపల్లి పాపారావు లాంటి వ్యక్తులు మనకి ప్రతీచోటా తారస పడుతూ ఉంటారు. రెండవ నాటిక 'స్వతంత్రమా జాగ్రత్త' విషయానికి వస్తే.. క్రీ.శ.1600 లో బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం మన దేశానికి వచ్చి చివరకి మనల్నే బానిసలుగా చేసుకుని సుమారు మూడువందల ఏళ్ళ పైగా పాలించారు. స్వతంత్రం కోసం ఎన్నో ఏళ్ళు ఎందఱో పోరాడి తమ జీవితాలని పణంగా పెట్టి చివరకి 1947 లో స్వాతంత్ర్యాన్ని సాధించారు. కానీ పేరుకి స్వాతంత్ర్యం వచ్చినా ప్రజల జీవితాల్లో మార్పు లేదు. అప్పుడు తెల్లవాళ్లు పాలించేవారు. ఇప్పుడు మనవాళ్లు. ప్రజలకి తగిలిన దెబ్బ ఒక్కటే. కాకపోతే రాయి మాత్రం తేడా.'నెట్టింటి భాగోతం' నాటిక దేనిని గుడ్డిగా నమ్మకూడదు అనే భావనతో హాస్యంగా రాసినదే. మన ఉద్దేశాన్ని ఎవరి మీదా బలవంతంగా రుద్దకూడదు. అది భార్య అయినా, భర్త అయినా ఎవరయినా సరే. ఒకవేళ రుద్దితే మీ మీద గౌరవంతో నటిస్తారు తప్ప వాళ్ళ ప్రవర్తన మార్చుకోరు. ఆరోగ్యానందం పచ్చి కూరలు, మొలకలు తింటే ఆరోగ్యమని చెప్పాడని గుడ్డిగా నమ్మి భార్య అలివేలుని కూడా పాటించమంటాడు అప్పారావు. ","brand":"Kasturi Vijayam","offers":[{"title":"Default Title","offer_id":62084944986482,"sku":"BS-R4W-383596","price":16.63,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0987\/2972\/2226\/files\/9788196383596-HD.jpg?v=1784494345","url":"https:\/\/www.novelpanel.com\/products\/thasmath-jaagrattha-telugu","provider":"Novel Panel","version":"1.0","type":"link"}