{"product_id":"touching-the-zenith","title":"Touching the Zenith","description":"\u003cp\u003e\"Touching the Zenith\" అంటే శిఖరాన్ని తాకడం మాత్రమే కాదు, ఇది మనిషి లోపలి సామర్థ్యాన్ని, వికాసాన్ని, రూపాంతరాన్ని విశ్లేషించే గాఢమైన జీవన ప్రయాణం. మానవ సంబంధాల విషయం నందు దశాబ్దాల అనుభవం గల విద్యావేత్త నూతలపాటి నాగేశ్వరరావు రచించిన ఈ గ్రంథం, తాత్వికత, మానసిక విజ్ఞానం, జీవన అనుభవాలను ఒకే వేదికపైకి తెచ్చి, సారథులుగా మారే విధంగా మార్గనిర్దేశం చేస్తుంది.\u003c\/p\u003e\u003cp\u003eఈ పుస్తక విశిష్టత ఏమిటంటే, ఇది అనేక కోణాలలో ఆలోచించగలిగే దృక్పథాన్ని అందిస్తుంది. భారతీయ ఇతిహాసాల సందేశాలు, అంతర్జాతీయ ఆలోచనాధారుల దృక్పథాలు, వ్యక్తిగత జీవన సంఘటనలతో మానవ స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ, ఆత్మాన్వేషణకు దారులు చూపుతుంది.\u003c\/p\u003e\u003cp\u003eశాంతిని పొందడం, నిర్దేశిత లక్ష్యంతో జీవించడం, విఫలతలను ఎదుర్కోవడం, భావోద్వేగాలను సమతుల్యం చేయడం, శ్రద్ధ, క్రమ శిక్షణ ను పెంపొందించుకోవడం వంటి అంశాలపై ఆవిష్కరణలు ఈ గ్రంథాన్ని సమగ్రంగా తీర్చిదిద్దాయి.\u003c\/p\u003e\u003cp\u003eప్రస్తుతం నేను పీహెచ్.డి పరిశోధన చేస్తున్న వారిగా, ఈ పుస్తకాన్ని చదువుతూ చాలాసార్లు ఆగి ఆలోచించాల్సి వచ్చింది. వ్యక్తిత్వ వికాసానికి వయసు లేకపోయినట్లు, వృత్తి కూడా అవరోధం కాదు అని ఈ గ్రంథం హృదయంగా గుర్తుచేస్తుంది. విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా, గృహిణి అయినా, జీవితాన్ని కొత్త దశలో మలుపు తిప్పుతున్నవారైనా, ప్రతి ఒక్కరికీ ఇది సార్ధకతను అందించే జీవనశాస్త్రం.\u003c\/p\u003e\u003cp\u003eఇది కేవలం శిఖరాన్ని చేరడంపైన కాదు, ఆ శిఖరానికి అర్థం ఏంటో మనం తెలుసుకోవడమే ఈ పుస్తక ప్రయోజనం.\u003c\/p\u003e\u003cp\u003e\u003c\/p\u003e\u003cp\u003e- బాల ఈశ్వరి\u003c\/p\u003e\u003cp\u003eపిహెచ్.డి పరిశోధకురాలు, ఐఐటీ ఖరగ్]పూర్\u003c\/p\u003e\u003cp\u003e\u003c\/p\u003e\u003cp\u003e\u003c\/p\u003e","brand":"Kasturi Vijayam","offers":[{"title":"Default Title","offer_id":62079183978866,"sku":"BS-R4W-710840","price":28.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0987\/2972\/2226\/files\/9788198710840-HD.jpg?v=1784438138","url":"https:\/\/www.novelpanel.com\/products\/touching-the-zenith","provider":"Novel Panel","version":"1.0","type":"link"}